జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా...!!

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 11:22 AM

జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా...!!

కోడూరి సింహ హీరోగా తెరకెక్కుతున్న 'మత్తు వదలరా' చిత్రం ఫస్ట్ లుక్ ను జూనియర్ ఎన్టీఆర్ ఈ ఉదయం తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. "సమయం గడిచిపోతోంది. నా సోదరులంతా పెరిగిపోయారు. సింహా కోడూరి హీరోగా, భైరి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న 'మత్తు వదలరా' చిత్రం ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. తొలి చిత్రాలతోనే వీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర టీమ్ కు శుభాకాంక్షలు" అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements