ఆల్‌ఖైదా చీఫ్‌ ను హతమార్చిన ఇండియన్ ఆర్మీ..!!

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 04:58 PM

పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు, కాల్పులకు భారత సైన్యం దీటైన సమాధానం చెప్తుంది. గత మూడు రోజులుగా బోర్డర్ లో ఇండియా, పాక్ దేశాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో విదేశీ జర్నలిస్టులు ఉన్నారని, కాల్పులు జరపవద్దని చెప్పిన పాక్.. చెప్పిన కాసేపటికే ఆ మాటను పక్కన పెట్టిన ఇండియా పోస్టులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవానులు మరణించగా, ఒక పౌరుడు కూడా మరణించారు. దానికి ప్రతీకగా ఆదివారం రోజున ఇండియన్ ఆర్మీ ఆర్టిలరీ గన్స్ తో పీవోకే నీలంలోయలోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది.
నిన్నటి రోజున కూడా ఇండియన్ పీవోకే ఉగ్రస్థావరాలపై మరోసారి విరుచుకుపడింది. ఈ ఘటనలో 50మంది వరకు ఉగ్రవాదులు మరణించగా, ఏడుగురు పాక్ జవాన్లు మరణించారు. ఇదిలా ఉంటే కాశ్మీర్లో ఉగ్రవాద ఏరివేతను ఇండియన్ ఆర్మీ ముమ్మరం చేసింది. అవంతిపొరా సెక్టార్‌ జరిగిన ఎన్ కౌంటర్ లో కాశ్మీర్ ఆల్ ఖైదా చీఫ్ హమీద్ లెల్హారీ ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. హమీద్ లెల్హారీ అలియాస్ అన్సర్ ఘజ్వత్ కశ్మీర్ అల్‌ఖైదా విభాగానికి నేతృత్వం వహిస్తున్నాడు. ఈ ఆపరేషన్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతం అయినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.





Untitled Document
Advertisements