హానర్ 20 సిరీస్ లో మరో కొత్త ఫోన్

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 07:15 PM

హానర్ 20 సిరీస్ లో మరో కొత్త ఫోన్

హువావే సబ్ బ్రాండ్ హానర్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హానర్ 20 సిరీస్ లో భాగంగా హానర్ 20 లైట్(యూత్ ఎడిషన్)ను హానర్ సంస్థ బుధవారం చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ మరి కొన్ని నెలల్లోనే భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అసలింతకీ ఈ ఫోన్ ధర ఎంత? ఫీచర్లేంటి? అంటే ఇందులో మొత్తం నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,399 యువాన్లు(సుమారు రూ.14 వేలు)గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా(సుమారు రూ.15 వేలు) ఉండగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 యువాన్లుగా(సుమారు రూ.17 వేలు)గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను 1,899 యువాన్లకు(సుమారు రూ.19 వేలు) విక్రయిస్తున్నారు. బ్లాక్, గ్రీన్, బ్లూ-పింక్ గ్రేడియంట్ రంగుల్లో ఇది లభించనుంది. చైనాలో దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం కాగా, అమ్మకాలు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ఈఎంయూఐ 9.1.1పై పని చేయనుంది. ఆర్క్ కంపైలర్, ఈఆర్ఓఎఫ్ఎస్(EROFS), జీపీయూ టర్బో 3.0 ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఇందులో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 22.5W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 4g VoLTE, వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ ను ఇందులో అందించారు.





Untitled Document
Advertisements