చేనేత కుటుంబాలకు జగన్ తీపి కబురు

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 08:08 PM

ఆంద్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆతరువాత రాష్ట్రాభివృద్ధికై ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ సంచలనాలను సృష్టిస్తున్నాడు. కాగా ఎన్నికలకు ముందే ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలందరి మన్ననలను పొందుతున్నారు. కాగా సీఎం జగన్ తాజాగా రాష్ట్రంలోని నేతన్నలందరి కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. కాగా ఈమేరకు చేనేత కుటుంబాలకు అండగా వారందరికీ కూడా ఆపన్న హస్తం అందించడానికి ఏపీ ప్రభుత్వం తరపున “వైఎస్సార్‌ నేతన్న నేస్తం” అనే పథకాన్ని అమలు చేయడానికి బుధవారం నాడు అధికారికంగా సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం.

కాగా ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సొంత మగ్గం కలిగినటువంటి కుటుంబాలకు సంవత్సరానికి రూ.24 వేలు అందించనున్నారు. కాగా ఈ పథకం ఈ ఏడాది డిసెంబర్ నెల నుండి అమలవనుందని సమాచారం. అయితే ఈ పథకం ద్వారా నేతన్నల యొక్క మగ్గం ఆధునికరణ, నూలు కొనుగోలు చేయడానికి చాలా అవకాశాలు లభించనున్నాయి. కాగా ఈ పథకానికి మగ్గం ఉన్నటువంటి ప్రతీ కుటుంబాన్ని అర్హులుగా ప్రకటించనున్నారు





Untitled Document
Advertisements