ఎయిర్ టెల్ నయా ప్లాన్...జియో పోటీగా లాంచ్

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 09:00 PM

ఎయిర్ టెల్ నయా ప్లాన్...జియో పోటీగా లాంచ్

టెలికాం రంగం సంస్థ ఎయిర్ టెల్ అధిక డేటాను అందిస్తూ, అదనపు ప్రయోజనాలను అందించే ప్లాన్లపై దృష్టి పెట్టింది. తాజాగా అధిక డేటాను అందించే అద్భుతమైన ప్లాన్ ను తీసుకువచ్చింది. అదే రూ.558 రీచార్జ్ ప్లాన్. రూ.558 విలువైన ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే.. రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ 82 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా మీకు రూ.558కే 246 జీబీ డేటా లభిస్తుందన్న మాట. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా మీరు ఈ రీచార్జ్ చేసుకున్నట్లయితే.. రోజుకు మరో 400 ఎంబీ అదనంగా డేటా లభిస్తుంది. అంటే 3 జీబీ బదులు రోజుకు 3.4 జీబీ డేటాని ఎయిర్ టెల్ అందిస్తుంది. గతంలో ఎయిర్ టెల్ ఇలాంటిదే రూ.549 ప్లాన్ ను అందించేది. ఈ రూ.558 ప్లాన్ అందుబాటులోకి వచ్చాక ఆ ప్లాన్ ను రద్దు చేసింది. ఈ ప్లాన్ ను జియో రూ.509 ప్లాన్ కు పోటీగా లాంచ్ చేశారు. జియో రూ.509 ప్లాన్ ద్వారా రోజుకు 4 జీబీ డేటాను, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను, జియో నెట్ వర్క్ నంబర్లకు అపరిమితమైన ఉచిత కాలింగ్ ను అందిస్తారు. అయితే ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం కేవలం 28 రోజులు మాత్రమే. జియో కాకుండా ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేయాలంటే నిమిషానికి ఆరు పైసలు చార్జీ విధిస్తారు. అయితే ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ద్వారా అధిక వ్యాలిడిటీని అందించడమే కాకుండా, అన్ని నెట్ వర్క్ లకు ఉచిత కాలింగ్ అందించడం ద్వారా వినియోగదారులకు అధిక లాభాలు అందిస్తోంది.





Untitled Document
Advertisements