లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్...నిఫ్టీ 16 పాయింట్లు పైకి

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 09:07 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్...నిఫ్టీ 16 పాయింట్లు పైకి

దేశీ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు, ఆటో స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు కనిపించింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేరు కూడా రీబౌండ్ అయ్యింది.సెన్సెక్స్ 95 పాయింట్ల లాభంతో 39,059 పాయింట్ల వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,604 పాయింట్ల వద్ద ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్ షేర్ల ర్యాలీ సూచీలకు కలిసొచ్చింది. నిఫ్టీ 50లో హెచ్‌సీఎల్ టెక్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ దాదాపు 4 శాతం పెరిగింది.అదేసమయంలో అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, వేదాంత, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్ ఏకంగా 6 శాతానికి పైగా పడిపోయింది.నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 2 శాతానికి పైగా పరుగులు పెట్టింది. నిఫ్టీ ఆటో 1.2 శాతం మేర ర్యాలీ చేసింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి.





Untitled Document
Advertisements