వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రమంతటా డబుల్ బెడ్‌రూం ఇళ్ళు

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 07:01 AM

వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రమంతటా డబుల్ బెడ్‌రూం ఇళ్ళు

రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణ సంస్థ వేగంగా పూర్తి చేస్తోంది. ఈ సంక్రాంతి వరకు పూర్తి చేయనున్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్ట ర్లు ఇప్పటికే మొదలుపెట్టినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ చైతన్యకుమార్ మన తెలంగాణకు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.83 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 35వేలకు పైగా డ బుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులకు ప్రభుత్వం అం దజేయగా, రాష్ట్ర వ్యాప్తంగా జిహెచ్‌ఎంసితో పా టు 32 జిల్లాల పరిధిలో దాదాపు 1.40 లక్ష ల ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ పూ ర్తి చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డ బుల్ బెడ్‌రూమ్ నిర్మాణ ప్రాంతాల్లో ప్రసుత్తం ప్రాథమిక, మౌలిక వసతుల కల్పన పనులు వే గంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నాటి కల్లా ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. వెం టనే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆయా జిల్లాల అధికారులకు అదేశాలను జారీ చేశారు.
డబుల్ బెడ్‌రూమ్ పథకం సమగ్ర సమచారం.

రాష్ట్ర వ్యాప్తంగా మూంజూరు చేసిన ఇళ్లు 2.83 లక్షలు,
ప్రభుత్వ అనుమతులు జారీ చేసినవి 2.60 లక్షలు,
టెండర్‌లు ఆహ్వానించినవి 2.36 లక్షలు,
టెండర్‌లు పూర్తి చేసినవి 2లక్షలు,
నిర్మాణాలు ప్రారంభమయినవి 1.79లక్షలు,
కేటాయింపులు పూర్తయినవి 36వేలు,
సంక్రాంతిలోపు కేటాయింపులకు సిద్ధమయినవి 1.40లక్షలు,
పథకం వ్యయం రూ.6,996 కోట్లు.

*జిల్లాల వారీగా మంజూరు చేసిన ఇళ్ల వివరాలు:

జోగులాంబ గద్వాల్ (2,800), మహబుబ్‌నగర్ (7,916), నాగర్‌కర్నూల్(3,701), వనపర్తి(2,410), మెదక్(5,514), సంగారెడ్డి (5,555), సిద్ధిపేట(14,703), కామరెడ్డి(8,220), నిజామాబాద్ (11, 066), అదిలాబాద్(4,195), కొమరం భీం(1,223), మంచిర్యాల (4,227), నిర్మల్(6,273), జగిత్యాల్(8,730), కరీంనగర్ (6,564), పెద్దపల్లి(3,352), రాజన్నసిరిసిల్లా(7,169), భూపాల్‌పల్లి(3,882), జనగాం(4,578), మహబుబాబాద్ (5,678), వరంగల్ రూలర్ (4,087), వరంగల్ అర్బన్(5,221), భద్రాద్ది కొత్తగూడేం(6,438), ఖమ్మం (14,560), నల్గొండ(81,55), సూర్యపేట(5,614), యాదా ద్రి భువనగిరి(3,506), వికారాబాద్(4,323), రంగారెడ్డి(6,777), మేడ్చల్(2,350), ములుగు (1,796), నారాయణపేట్(2,773).





Untitled Document
Advertisements