ప్రైవేటు పర్మిట్ల ప్రక్రియలో మార్పులు !

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 07:32 AM

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన 5100 రూట్లను ప్రైవేటు వ్యక్తులకు పర్మిట్లు జారీ చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి నవంబర్ 2న చేసిన తీర్మానం ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రాలేదని ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేలోగా అందులో మార్పులు చేర్పులు జరగొచ్చన్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను సవాల్ చేసిన పిల్‌లో సీఎస్ అఫిడవిట్ వేశారు. సచివాలయం నిబంధనల ప్రకారం మంత్రిమండలి నిర్ణయం రహస్యమని, దీనికి సంబంధించి నిబంధన 166(1) ప్రకారం రాజ్యాంగ ప్రక్రియ పూర్తికాకుండా హైకోర్టులో సవాల్ చేయరాదన్నారు. అది నోట్‌ఫైల్స్‌లో భాగమని, వీటిని బహిర్గతం చేయకూడదన్నారు. మంత్రిమండలి నిర్ణయం మధ్యలోనే ఉండగా న్యాయసమీక్షకు అవకాశం లేదన్నారు.





Untitled Document
Advertisements