ఈశాన్య దిశ నుంచి చలిగాలులు...కోస్తాంధ్రలో మూడురోజులు వర్షాలు

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 07:33 AM

నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఈశాన్య దిశ నుంచి చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాగల మూడురోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ 16.2 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం 19.4, హైదరాబాద్ 20.4, జగిత్యాల 16.8, జనగాం 18.1, జయశంకర్ భూపాలపల్లి 18.6, జోగులాంబ గద్వాల 21.5, కామారెడ్డి 16.4, కరీంనగర్ 17.6, ఖమ్మం 20, కొమురంబీం ఆసిఫాబాద్ 15.6, మహబూబాబాద్ 19.5, మహబూబ్‌నగర్ 18.2, మంచిర్యాల 17.3, మెదక్ 17.4, మేడ్చల్ మల్కాజిగిరి 17.9, ములుగు 18.6, నాగర్‌కర్నూల్ 19.2, నల్లగొండ 19.6, నారాయణపేట 19.9, నిర్మల్ 16.4, నిజామాబాద్ 16.1, పెద్దపల్లి 17.8, రాజన్న సిరిసిల్ల 16.6, రంగారెడ్డి 17.5, సంగారెడ్డి 17.6, సిద్దిపేట 17, సూర్యాపేట 21, వికారాబాద్ 17.1, వనపర్తి 19, వరంగల్ రూరల్ 18.9, వరంగల్ అర్భన్ 17.7, యాదాద్రి భువనగిరి 17.5గా నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, యానాంలలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాయలసీమలో శనివారం రాత్రి, ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.





Untitled Document
Advertisements