కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది, మేము నోట్ చేసుకున్నాం, మధ్యలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 07:00 PM

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే సభా కార్యక్రమాలు సజావుగా నడిపేందుకు సహకరించాలని కోరుతూ పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఆల్‌పార్టీ మీటింగ్‌ నిర్వహించారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.

అయితే ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి కి అఖిలపక్ష నేతలు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన, జగన్ జైలు అంశాలు చెప్పబోతే పలు పార్టీల నేతలు అడ్డుకున్నారట. ఇది ఒక రాష్ట్రానికి సంభందించిన వేదిక కాదంటూ చురకలు వేసినట్టు సమాచారం. పార్లమెంట్ స్థాయిలో అఖిలపక్షం ఎందుకు పెడతారో నేర్చుకోవాలని నేతలు సలహా ఇచ్చారట. అదీ కాక చిదంబరం పార్లమెంటు సమావేశాల్లో హాజరు అయ్యేందుకు బెయిల్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరగా ఆ విషయంలో జోక్యం చేసుకున్న విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ద్వంద ప్రమాణాలంటూ జగన్ జైలు శిక్ష అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. అయితే చిదంబరం వ్యవహారంలో విజయసాయిరెడ్డి జోక్యం చేసుకోవడంతో ఆయన మీద హోంమంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది, మేము నోట్ చేసుకున్నాం, మధ్యలో మీకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారట. అనవసరమైన, సంభంధంలేని విషయంపై చర్చకు ఎందుకు వస్తున్నారని టికే రంగరాజన్, ఎంకే ప్రేమ్ చంద్రన్, ఇతర సభ్యులు ప్రశ్నించినట్టు చెబుతున్నారు.





Untitled Document
Advertisements