రోడ్డు ప్రమాదాలపై కేంద్రానికి నివేదిక

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 06:01 AM

దేశవ్యాప్తంగా 50 పట్టణాలను అధ్యయ నం చేసిన కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచిందని ఓ నివేదికలో పేర్కొంది. దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలను అధ్యయనం చేసిన రవాణా మంత్రిత్వ శాఖ స్థానాల నివేదిక రూపంలో పొందుపరిచింది. అలాగే ప్రమాదాలలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణ కూడా ఎనిమిదవ స్థానంలోనే ఉండడం గమనార్హం. ప్రమాదాల సంఖ్య, వాటిల్లో మృతుల సంఖ్య ప్రాతిపదికన కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో ఈ గణాంకాలను తెలియజేసింది. కాగా ఆ నివేదికలోని మరికొన్ని వివరాలిలా ఉన్నాయి. కిందటి సంవత్సరం((2018) హైదరాబాద్లో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వివరించింది. ఈ ప్రమాదాలు సైతం అత్యధికంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయంలో చోటుచేసుకున్నాయని గుర్తించింది. రాష్ట్రంలో 2018లో మొత్తం 4,485 ప్రమాదాలు చోటుచేసుకున్నాయని నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్షంగా స మాలోచనలు సాగించిన ప్రభుత్వం రోడ్డు ప్రమాదా ల నివారణకు చేపట్టే అవగాహన కార్యక్రమాల కోస ం నిధులను పెంచాలని కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఈక్రమంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రాష్ట్రంలో మోటారు వాహనాల చట్టంలోని లోపాలను సరిచేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న మో టారు వాహన చట్టం 1988 నాటిదన్న విషయం తెలిసిం దే. ఆ కాలంలో ఉన్న వాహనాలకు అనుగుణంగా చట్టాన్ని రూపొందించారు. ఇదిలావుండగా అప్ప ట్లో దేశ వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో 49వేల పైచిలుకు ఉండగా అది కాస్త నేడు 1.50లక్షలకు చేరుకుంది. దీంతో మోటారు వాహనచట్టం విషయంలో 16 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం విచారకరం. ఏడాదికి స గటు 50 ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాల ను బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించడంలో అధికారులు వి ఫలమౌతున్నారు. అలాగే రాష్ట్రానికి నలువైపులా ఉ న్న జాతీయ రహదారుల్లో బ్లాక్ స్పాట్స్, డార్క్ స్పా ట్స్‌లను గుర్తించి యూటర్న్, అటవీ ప్రాంతాలలో డ్యాష్ బోర్డులు, సైన్ బోర్డుల ఏర్పాటు చేసేందుకు సర్కా రు సుముఖత చూపుతోంది. ముఖ్యంగా రోడ్డు ప్ర మాదాల నివారణ, భద్రత విషయంలో కట్టుదిట్టమై న చర్యల్లో భాగంగా వాహనాలకు నిర్ధిష్ట వేగాన్ని నిర్ణయించడం, ఆపై వేగ నియంత్రణ సూచికలను రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసేందుకు అధికారులు పనిచేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశించినా అశించిన మేరకు పనులు జరుగలేదని తె లుస్తోంది, ఈ నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని సం బంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.







Untitled Document
Advertisements