పూర్వపు స్థానాలకు 300 మంది తహశీల్దార్లు బదిలీ

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 06:04 AM

రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు బదిలీ అయిన తహసీల్దార్లను మళ్ళీ అక్కడికే పంపిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సుమారు 378 మంది తహసీల్దార్లను తిరిగి పూర్వ స్థానాలకు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రెసా నాయకులతో సోమేష్‌కుమార్ ఆదివారం భేటీ అయ్యారు. మొదటగా బదిలీలు చేస్తున్నామని, విడతల వారీగా మిగతా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వారితో పేర్కొన్నారు. ముఖ్యంగా బదిలీల సమస్యతో అనేక ఇ బ్బందులు ఎదుర్కొంటున్నామని సంఘాల నాయకులు పేర్కొనడంతో సిఎం కెసిఆర్ కూడా దీనిపైనే దృష్టి సారించారని ఆ యన ఆదేశాల మేరకే బదిలీలు చేస్తున్నామని సోమేష్‌కుమార్ సంఘాల నాయకులతో పేర్కొన్నారు. మిగతా సమస్యలపై దృష్టి సారించామని ఎవరూ ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాకుండా వ్యవహారించాలని సోమేష్‌కుమార్ రెవెన్యూ సంఘాల నాయకులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తహసీల్దార్లతో పా టు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసిం ది. అనంతరం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వి డుదలకు ముందే మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొందరు రెవెన్యూ అధికారులను ఈ సీ సూచనల మేరకు ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి బదిలీలకు సంబంధించిన సమ స్య పెండింగ్‌లో ఉండడంతో బదిలీలు చేయాల ని పలు దఫాలుగా ప్రభుత్వానికి రెవెన్యూ సం ఘాల నాయకులు విజ్ఞప్తులు చేశారు. అబ్ధుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం అనంతరం నెలకొన్న సంఘటన నేపథ్యం లో ట్రెసాతో పాటు రెవెన్యూ సంఘాల విజ్ఞప్తి మేరకు జోన్ 5లో పనిచేసే 166 మంది తహసీల్దార్లను, జోన్6లో పనిచేసే 212 మంది తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్ నాయకత్వంలో వారం రోజుల క్రితం మంత్రి కెటిఆర్‌ను కలిసి రెవెన్యూ సంఘాలు నాయకులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కెటిఆర్ వారి సమస్యలను సిఎం దృష్టికి తీ సుకెళ్లడంతో 15 రోజుల్లోగా సమస్యలను పరిష్కరిస్తానని సిఎం కెసిఆర్ హామినిచ్చారు. అం దులో భాగంగా మొదటగా తహసీల్దార్లను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్, మేయర్ బొంతు రాంమ్మోహన్‌లకు రెవెన్యూ సంఘాల తరఫున కృతజ్ఞతలు. తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ (ట్రెసా) తరఫున రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, తాము చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా రెవెన్యూ ఉద్యోగులందరం వ్యవహారిస్తామని, మిగతా సమస్యలను సిఎం కెసిఆర్ త్వరలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.









Untitled Document
Advertisements