అబ్బురపరుస్తున్న దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 06:07 AM

హైదరాబాద్ లోని దుర్గం చెరువు మీద నిర్మిస్తున్న వేలాడే వంతన (కేబుల్ బ్రిడ్జి) నిర్మాణ పనులు ప్రజలను అబ్బురపరుస్తున్నాయి. అత్యంత వేగంగా, ఆధునాతనమై న సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న దుర్గంచెరువు బ్రిడ్జి పనులకు సంబంధించిన ఫోటోలను, ప్రగతి వివరాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె టిఆర్ ఆదివారం తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. భారీ స్థాయిలో నిర్మిస్తు న్న ఈ బ్రిడ్జిని పలు కోణాల్లో ఫోటోలు తీసి వాటిని ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని విధంగా దుర్గం చెరువుపై ఈ వంతెన నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పశ్చిమబెంగాల్ రా ష్ట్రంలోని హౌరా… కోల్‌కత్తాల నడుమ నున్న హౌరా బ్రిడ్జిని తలపించేలా ఈ వే లాడే వంతెన పనులు కొనసాగుతున్నాయి. మొత్తం రూ.184 కోట్లతో నిర్మితం అవుతున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రజలను సంభ్రామాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. సమారు 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తున సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్ల అమరికను అత్యాధునిక సాంకేతిక పద్దతులను వినియోగిస్తోంది. అప్రోచ్‌లతో సహ బ్రిడ్జి పొడువు మొత్తం 1048 మీటర్లు కాగా, కేబుల్ స్టే బ్రిడ్జి 366 మీ, అప్రోచ్ వయాడక్టు ర్యాంపు 682 మీటర్లతో నిర్మాణం అవుతోంది. మొత్తం ఆరు లేన్లు, పుట్‌పాత్‌లతో నిర్మితం అవుతున్న ఈ బ్రిడ్జిపై అధునాతమైన ఎల్‌ఇడి లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాగా నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు ఒక్కో సెగ్మెంట్‌ను మాత్రమే అమర్చంగా రెండు రోజుల క్రితం ఏకకాలంలో రెండు సెగ్మెంట్లను ఒకేసారి పైకి తీసుకెళ్ళి విజయవంతంగా అమర్చారు. కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే ఈ పని పూర్తి చేసిన ఇంజనీరింగ్ టీమ్ పనితీరును మంత్రి కెటిఆర్ మెచ్చుకుంటూ ట్విట్టర్‌లో వారిని అభినందించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేందుకు మొత్తం 53 సెగ్మెంట్లు అమర్చాల్సి ఉండగా, ఈ రెండెంటితో కలిసి 50 సెగ్మెంట్ల అమరిక పూర్తి అయింది. ఇక మిగిలిన మూడు సెగ్మెంట్ల అమరిక పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయి. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సమీప ప్రాంతం నుంచి మాదాపూర్ ఇనార్బిట్‌మాల్ వరకు దాదాపు కిలోమీటర్ల పొడవునా నిర్మించే ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ నుంచి హైటెక్‌సిటి, మాదాపూర్ రూట్ వెళ్ళే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. అలాగే నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ జిల్లాకు వచ్చే వారికి కూడా ఎంతో సదుపాయంగా ఉంటుంది. దీంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 36, మాదాపూర్ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. జూబ్లీహిల్స్ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలి వెళ్ళే వారికి దాదాపు 2 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది.





Untitled Document
Advertisements