ఎన్నికలకు దూరం!

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 06:36 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నట్టు లెబనాన్‌ మాజీ ఆర్థికమంత్రి, ప్రధాని అభ్యర్థి మొహ్మద్‌ సదాఫీ (75) ప్రకటించారు. సదాఫీ గతంలో పార్ల మెంట్‌ సభ్యుడిగా సేవలం దించారు. ఆయ నను ఎన్నికల బరిలో దించాలని మూడు ప్రధాన పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ ప్రకటన వెలు వడిన వెంటనే లెబనాన్‌ పౌరులు బీరుట్‌ వీధు ల్లోకి చేరుకొని ఆందోళన చెపట్టారు. ప్రధాని పదవికి సదాఫీ పోటీ చేయడా న్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేపటారు. 'సదాఫీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని మేం అంగీకరించం.. ఆయన అవినీతిపరుడు. ఇలాంటి వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయొద్దు' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. లెబనాన్‌లో గతనెలలో ప్రధాని సాద్‌ హరీరీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తా యి. ఆయన పాలనలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న దని, అవినీతి పెరిగిపో యిందని విమర్శి స్తూ ప్రజలు ఆందోళన కార్యక్ర మాలు చేపట్టారు. నిరసనలు హింసాత్మకంగా మారడం తో గతనెల 29న ప్రధాని పదవికి హరీరీ రాజీనా మా చేశా రు. కాగా, సదాఫీ 2011 నుంచి 2014 వరకు ప్రధాని నజీబ్‌ మికాటీ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రి గా పనిచేశారు.

Untitled Document
Advertisements