గ్రీన్ ఛాలెంజ్...మొక్కలు నాటిన తారలు

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 06:52 AM

గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం లో భాగంగా సినీ నటీమణలు రజిత, రాగిని ఆదివారం లాంకో హిల్స్ లేక్ సమీపంలోని జిహెచ్‌ఎంసిలో పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుఆమర్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతోందన్నారు. సమాజంలోని అన్ని రంగాల వలనే సినిమా రంగం నుంచి కూడా గ్రీన్ ఛాలెంజ్‌కు చక్కటి స్పందన లభిస్తుండడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రకృతిని కాపాడుకుని మానవజాతి మనుగడకు తమ వంతు సాయం చేసే అవకాశాన్ని కల్పించిన సంతోష్‌కుమార్‌కు ప్రత్యేకంగా అభివందనలతో పాటు ప్రశంసల జల్లు కురిపించారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ సుమ కనకాల విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను బిగ్‌బాస్ విజేత రా హుల్ సిప్లిగంజ్ స్వీకరించారు. ఇందులో భాగం గా ఆయన మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. వారిలో విశ్వేక్సేన్ నాయు డు, తరుణ్ భాస్కర్ డైరెక్టర్ (పెళ్ళి చూపులు ఫేం), వరంగల్ వెస్ట్ ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ, తన జీవితంలో మొదటి సారి ప్రకృతిని పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చిన సుమకు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపి సంతోష్‌కుమార్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. రామగుండం ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను తిరువళ్లూర్ మాజీ శాసనసభ్యుడు శేఖర్ స్వీకరించారు. ఈ సందర్భంగా మూడు మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. అదే విధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపి సంతోష్‌కుమార్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని ప్రశంసించారు. అనంతరం మదురై ఎంఎల్‌ఎ టైగర్ రాజు, మంగళూరు ఎంఎవ్‌ఎ ఖాదిర్, తమిళ సినిమా హీరో హరిలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మొక్కలు విస్తృతంగా నాటడం ద్వారా కాలుష్యా న్ని తగ్గించవచ్చునని నిడదవోలు ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌నాయుడు అన్నారు. పచ్చదనానికి నిలయమైన ఉభయ గోదావరి జిల్లాలో సైతం భూగర్భ జలాలు కలుషితం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోందనన్నా రు. అభివృద్ధిలో భాగంగా రహదారుల వెంట చెట్లు తీసివేయాల్సి వస్తే ఒక చెట్టుకు ఐదు మొక్కలు నాటే యత్నం చేయాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్‌లో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్న ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలుపున్నట్లు సంతోష్‌కుమార్ తెలిపారు. ఒక సామాజిక బాధ్యతగా మొదలుపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తుండడం ఆనందంగా ఉందని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఒకరు విసిరిన ఛాలెంజ్‌ను మరొకరు స్వీకరించి…వారు ఇతరులకు ఛాలెంజ్ విసురుతుండడంతో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉధృతంగా సాగుతోందన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లో కూడా ఇదే రీతిలో కొనసాగుతుండడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.













Untitled Document
Advertisements