కేంద్రం పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా పెరిగేనా?

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 06:57 AM

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా 50 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అలాగే 2011 జనాభా ప్రా తిపదికన వెయిటిజీ కాకుండా 1971 ప్రకారమే ఇ వ్వాలని కోరింది. బడ్జెట్ తయారీలో నివేదికలోని అం శాలు కీలకంకానున్నాయి. కేంద్ర పన్ను ఆదాయాన్ని రాష్ట్రా ల మధ్య ఏ నిష్పత్తిలో పంచాలో నిర్ణయించే కీల క రా జ్యాంగ సంస్థ ఆర్థిక సంఘం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి రా నున్నందున ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఐదేళ్ల పాటు ఈ సిఫార్సులు అమలులో ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రాలకు కేంద్ర నిధుల వాటా అంశంతో పాటు అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సం ఘానికి నివేదించింది. కేంద్ర పన్ను ఆదాయంలో 42 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం నిర్ణయించింది. మిగిలిన 58 శాతం నిధులను కేంద్ర ప్ర భుత్వం జాతీయ అవసరాలకు ఉపయోగిస్తుంది. మ రోవైపు కొన్ని పథకాలను కేంద్రం రద్దు చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం వాటాలను తగ్గించుకుని రాష్ట్రాల వాటాను పెంచింది. ఇప్పటికే సిఎం కె.చ ంద్రశేఖర్‌రావు కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇస్తున్న పన్నుల్లో సగం కూడా అది తిరిగి రావడం లేదని, ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి కష్టపడాల్సి వస్తోందని విమర్శించారు. సంక్షేమ పథకాలను అమలు చేసుకునే బాధ్యతను పూర్తిగా రాష్ట్రాలకు ఇవ్వాలని రాష్ట్రం కోరింది. అలాగే ఐదేళ్లకు సాగునీటి ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ.40,169 కోట్లు గ్రాంట్‌గా ఇచ్చేలా సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇంటింటికి రక్షిత మంచినీటిని ఇచ్చే మిషన్‌భగీరథ నిర్వహణకు రూ.12,722 కోట్లు ఇవ్వడంతో పాటు కేంద్రం పన్నుల రాబడిలో 14 శాతంగా ఉన్న సర్‌ఛార్జీలు, సెస్‌ల్లో రాష్ట్రాలకు వాటా ఉండాలని కోరింది. రోడ్ సెస్, క్లీన్ ఎనర్జీ సెస్‌లలో రాష్ట్రాలకు న్యాయబద్ధంగా వాటా ఇవ్వడంతో పాటు సమర్థంగా వ్యవహరిస్తున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నొక్కి చెప్పారు. కేంద్ర నిధుల పంపిణీ లెక్కల కోసం వెయిటేజీలో 13వ ఆర్థిక సంఘం కూడా 1971 జనాభా లెక్కలకు 25 శాతం కేటాయించింది. అయితే 2013లో ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం అందులో మార్పులు చేసింది. 1971 జనాభా గణాంకాల వెయిటేజీని 17.5 శాతానికి తగ్గించింది. 2011 జనాభా లెక్కలకు 10 శాతం వెయిటేజీ ఇచ్చింది. ఆర్థిక సంఘం పూర్తిగా రాష్ట్ర జనాభా సంఖ్య ప్రాతిపదికనే ఈ వాటాలను నిర్ణయించదు. జనాభా సంఖ్యకు కొంత వెయిటేజీ ఇస్తుంది. అలాగే.. తలసరి ఆదాయం, రాష్ట్ర విస్తీర్ణం, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలకూ వెయిటేజీ ఇస్తుంది.





Untitled Document
Advertisements