బౌద్ధ సంగీతి ముగింపు సభలో మంత్రి జగదీశ్ రెడ్డి

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 06:58 AM

హైదరాబాద్‌లోని ఎంసిహెచ్‌ఆర్‌డిలో రెం డురోజులుగా జరుగుతున్న బౌద్ధ సంగీతి -2019 ముగింపు సదస్సుకురాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. థాయిలాండ్, నేపాల్, భూటాన్, తదితర 17 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ప్రపంచ స్థా యి సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగిస్తూ బు ద్ధిజానికి, తెలంగాణకు మొదటి నుంచి ఉన్న సారూప్యాన్ని ఆ యన వివరించారు. బుద్ధిజం మొదలైన కాలానికి ఇప్పటికి ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి అప్పటికంటే ఇప్పుడున్న సమజానికి బౌద్ధిజం పరిమళాలు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.తెలంగాణ సమాజపు ఆలోచనలు బౌద్ధిజానికి ప్రతీకలనీ ఆయన అభివర్ణించారు. మధ్యలో ఒడి దుడుకులు ఎదురైనా ప్రాశస్త్యం తగ్గినట్లు కనిపించినా తెలంగాణ సమాజం పుట్టుకలోనే బౌద్ధిజం కలిసి పోయిందన్నది యదార్ధమన్నారు. బౌద్ధిజానికి అనవాళ్లుగా నిలిచిన సూర్యాపేట జిల్లాలోని అయిదు ఆరామల ప్రత్యేకతను కాపాడుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫణిగిరి, వర్ధమానకోట, నాగరంతో పాటు తిరుమలగిరి, చెన్నాయిపాలెంలలో లభించిన అవశేషాలు బౌద్ధిజానికి తెలంగాణ ప్రతీక అనేందుకు తార్కాణమన్నారు. శిధిలాల కింద కప్పబడిన విగ్రహాలు బయటకు రావడం కంటే బౌద్ధిజం ఆలోచనలు బయటకు తీసుకురావడం చారిత్రక అవసరమని ఆయన తెలిపారు.తాను జన్మించిన నాగారం మండల కేంద్రంలోనీ ఫణిగిరిలో బౌద్ధయిజానికి సంబంధించిన అనవాళ్లను తరలించే ప్రక్రియను విద్యార్థి దశలోనే అడ్డుకున్న ఉదంతాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత కాలంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి చరిత్రను అంతర్జాతీయ సమాజం ముం దుకు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. తద్వారా వచ్చిన తెలంగాణలో నాగార్జున సాగర్ వద్ద బుద్ధవనం నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చు ట్టారన్నారు.తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గంలో ఆరామలు ఉం డడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శిథిలాలు బయట పడినప్పటికి వాటి చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన గుర్తు చేశారు. అందుకు అవసరమైన నిధులు ఏర్పాటు చేసే విదంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముగింపు సభకు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు.





Untitled Document
Advertisements