ఐఎంబీఏలో బంగారు పతకం సాధించిన సంజయ్

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 07:03 AM

మేడ్చల్‌కు చెందిన బాడీ బిల్డర్ సంజయ్ యూఎస్‌ఏలో ఇంటర్నేషనల్ నేచురల్ బాడీబిల్డింగ్ అసోసియేషన్(ఐఎంబీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఒలింపియా పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. ఈనెల 14వ తేదీ నుంచి 17 వరకు నిర్వహించిన ఈ పోటీలకు వెళ్లిన అతను ఈ నెల 16న నిర్వహించిన ఫిజికల్లి ఛాలెంజ్ మెన్ స్టాండింగ్ విభాగంలో ప్రతిభ కనబర్చి, బంగారు పతకాన్ని సాధించాడు. దివ్యాంగుడైన అతను కష్టపడి అమెరికాలో జరిగిన పోటీలో పాల్గొని పతకాన్ని సాధించడంతో మేడ్చల్ వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Untitled Document
Advertisements