గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర, వెండిదీ ఇదే దారి

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 07:20 AM

బంగారం ధర మళ్లీ పడిపోయింది. సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,760కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.36,450కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. ఏకంగా రూ.650 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,000కు క్షీణించింది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,400కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 క్షీణతతో రూ.37,200కు తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.650 పతనమైంది. దీంతో ధర రూ.48,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.Untitled Document
Advertisements