ముగిసిన ఏపీపీ పరీక్ష...'కీ' విడుదల

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 07:29 AM

ఆంధప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విభాగంలో 50 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(APP) పోస్టుల భర్తీకి ఆదివారం (నవంబరు 17) నిర్వహించిన రాతపరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్షలు ముగిసాయి. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్‌ విధానం ద్వారా అభ్యర్థుల వివరాలను తీసుకున్నారు. ఈ సమాచారాన్ని మిగతా ఎంపిక ప్రక్రియలోనూ ఉపయోగించనున్నారు. గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం నగరాల్లోని 6 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి మొత్తం 2,488 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1 పరీక్షకు 1979 మంది (79.54 %) అభ్యర్థులు హాజరుకాగా.. 509 మంది అభ్యర్థులు హాజరుకాలేదు. ఇక పేపర్-2 పరీక్షకు 1941 మంది (78.01 %) అభ్యర్థులు హాజరుకాగా.. 547 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే నవంబరు 20న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈమెయిల్ ద్వారా నిర్ణీత నమూనాలో అభ్యర్థులు తమ అభ్యంతరాలను పంపాల్సి ఉంటుంది.






Untitled Document
Advertisements