హ్యాపీ బర్త్ డే నయనతార

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 10:57 AM

నయనతార గురించి అందరికి తెలిసిన విషయమే. ఆమె మలయాళం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయినప్పటికీ తెలుగు, తమిళ సినిమాల ద్వారానే పాపులర్ అయ్యింది. 1984 నవంబర్ 18 వ తేదీన నయనతార బెంగళూరులో పుట్టింది. అయితే, తండ్రి ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్తుండటంతో నయనతార కూడా వివిధ రాష్ట్రాలు తిరిగింది. విద్యాభాసం కూడా అలానే జరిగింది. అయితే, కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ వైపు ఆకర్షితురాలైన నయనతార.. మనస్సినక్కరే అనే సినిమా చేసింది. అది మలయాళం సినిమా. ఆమె మొదటి సినిమా ఇదే. ఈ సినిమా పర్వాలేదనిపించింది.

ఆ తరువాత నయనతార తమిళంలో అయ్యా సినిమా చేసింది. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ లు మెయిన్ హీరోలు. హరి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇక 2004లో వచ్చిన చంద్రముఖి సినిమా నయనతార లైఫ్ ను మలుపుతిప్పింది. రజినీకాంత్ పక్కన నటించి మెప్పించింది. ఆ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించడంతో తెలుగు దర్శకుల దృష్టి నయనతారపై పడింది. గజినీ, తెలుగులో లక్ష్మి, బాస్, యోగి, దుబాయ్ శ్రీను, శివాజీ, తులసి, భిల్లా, అదుర్స్, శ్రీరామ రాజ్యం, సైరా వంటి సినిమాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం ఆమె తమిళంలో టాప్ హీరోయిన్ అని చెప్పాలి. తమిళనాడులో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తమిళంలో ఆమె నటించే సినిమాలకు మంచి క్రేజ్ ఉన్నది. అంతేకాదు, సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకున్నది నయనతార. ఈరోజు నయనతార పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం.





Untitled Document
Advertisements