14 ఏళ్ళ బాలుడు కిడ్నప్ చేసాడు ... మీర్ పేట్‌లో కలకలం

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 11:03 AM

వయసు 14యేళ్లు...టెన్త్ క్లాస్ చదువుతున్నాడు...! ఆ వయసులో ధ్యాస అంతా చదువు మీదే ఉండాలి... కానీ హైదరాబాద్ మీర్ పేట్‌కు చెందిన ఓ బాలుడు...పక్కదారి పట్టాడు...ఏకంగా ఓ పిల్లాడిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు... మీర్‌పేట్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లాడు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి మూడు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. కంగారు పడ్డ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మూడు గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. కాల్ డేటా ఆధారంగా అల్మాస్ గూడ కు పదో తరగతి స్టూడెంట్‌ కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు.





Untitled Document
Advertisements