మార్కెట్లోకి Vivo Y19!

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 12:07 PM

మార్కెట్లోకి Vivo Y19!

వివో తన తాజా స్మార్ట్ ఫోన్ వివో వై19ను భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ లో అదిరిపోయే ఫీచర్లను వివో అందించింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, వెనకవైపు ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ఇదే పేరుతో వియత్నాం, థాయ్ ల్యాండ్ ల్లో, వివో వై5ఎస్ పేరిట చైనాలో ఇప్పటికే లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.13,990గా నిర్ణయించారు. మాగ్నటిక్ బ్లూ, స్ప్రింగ్ వైట్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ఆఫ్ లైన్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. కాబట్టి కొనుగోలు చేయాలనుకునే వారు వివో రిటైల్ షాప్ కు వెళ్లి ఈ ఫోన్ ను కొనవచ్చు. ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 17 గంటల పాటు ఈ ఫోన్ పని చేస్తుందని వివో తెలిపింది. ఈ ఫోన్ యూఎస్ బీ టైప్-సీని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 9.2పై వివో వై19 పని చేస్తుంది. డ్యూయల్ సిమ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇందులో యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ లు కూడా ఉన్నాయి. దీని బరువు 193 గ్రాములుగా ఉంది.


Untitled Document
Advertisements