హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు షాక్...డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 12:45 PM

హెచ్‌డీఎఫ్‌సీ  కస్టమర్లు షాక్...డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు

ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లు షాక్ ఇచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గింపు నిర్ణయం నవంబర్ 16 నుంచే అమలులోకి వచ్చిందని పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ నిర్ణయంతో బ్యాంక్‌లో డిపాజిట్ చేసే వారికి ఇకపై తక్కువ వడ్డీ లభిస్తుంది. రేట్ల సవరణ అనంతరం చూస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై 3.5 శాతం వడ్డీ లభిస్తోంది. 15 రోజుల నుంచి 29 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ పొందొచ్చు. 30 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ వస్తోంది. 46 రోజుల నుంచి 6 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ఆరు నెలల ఒక్క రోజు నుంచి 9 నెలల ఎఫ్‌డీలపై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. 9 నెలల నుంచి ఏడాదిలోపు మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.05 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. అలాగే సాధారణ డిపాజిట్లకు ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీంతో వీటిపై ఇప్పుడు 6.3 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. బ్యాంక్ ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేటు కూడా 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. వీటిపై ఇప్పుడు 6.3 శాతం వడ్డీనే వస్తుంది. దీర్ఘకాల ఎఫ్‌డీలపై కూడా వడ్డీ రేటు తగ్గింది. బ్యాంక్ వీటిపై కూడా 15 బేసిస్ పాయింట్ల మేర వడ్డీలో కోత విధించింది. రెండేళ్ల ఒక్క రోజు నుంచి 3 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 6.4 శాతం, 3 ఏళ్ల ఒక్క రోజు నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.3 శాతం వడ్డీ లభిస్తోంది. బ్యాంక్ ఐదేళ్ల నుంచి 10 ఏళ్లలోపు మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీలపై కూడా వడ్డీ రేటును తగ్గించింది. ఇప్పుడు వీటిపై కూడా 6.3 శాతం వడ్డీ వస్తోంది. ఇకపోతే సీనియర్ సిటిజర్స్ బ్యాంక్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లతో పోలిస్తే 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీని పొందొచ్చు. వీరికి ఎఫ్‌డీలపై 4 శాతం నుంచి 6.9 శాతం వరకు వడ్డీ లభిస్తోంది.









Untitled Document
Advertisements