వన్ ప్లస్ ఫోన్లపై బంపర్ ఆఫర్స్...రూ.10వేలు తగ్గింపు

     Written by : smtv Desk | Sun, Dec 08, 2019, 06:31 PM

వన్ ప్లస్ ఫోన్లపై బంపర్ ఆఫర్స్...రూ.10వేలు తగ్గింపు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ భారతదేశంలో తన సంస్థలకు ఆరో వార్షికోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా తన 7 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించనుంది. రూ.10 వేల వరకు తగ్గింపును తన స్మార్ట్ ఫోన్లపై అందించనుంది. ఈ డిస్కౌంట్లు వన్ ప్లస్ ఆన్ లైన్ స్టోర్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా లాంచ్ అయిన వన్ ప్లస్ 7టీ కూడా ఉండటం విశేషం. ఈ డిస్కౌంట్ సేల్ డిసెంబర్ 17 వరకు మాత్రమే జరనుంది. ఇందులో వన్ ప్లస్ ఏయే స్మార్ట్ ఫోన్ పై ఎంతెంత డిస్కౌంట్ అందించిందో చూడండి.

*​వన్ ప్లస్ 7 ప్రో(8 జీబీ + 128 జీబీ) - రూ.10,000 తగ్గింపు:

వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.52,999 కాగా, ఇప్పుడు దీని ధర రూ.42,999 వరకు తగ్గించారు. ఇందులో 6.67 అంగుళాల డిస్ ప్లే, వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్, 16 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ను అందించారు. సెల్ఫీల కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

*​వన్ ప్లస్ 7 ప్రో(12 జీబీ + 256 జీబీ) - రూ.9,000 తగ్గింపు:

వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.48,999కు తగ్గింది. అయితే ఇంతకుముందు దీని అసలు ధర రూ.57,999గా ఉండేది. పైన పేర్కొన్న స్మార్ట్ ఫోన్ పేర్కొన్న ఫీచర్లన్నీ ఇందులో కూడా ఉన్నాయి. కేవలం ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యం మాత్రమే దీనికి, దానికి ఉన్న ప్రధాన తేడా.

*​వన్ ప్లస్ 7 ప్రో(6 జీబీ + 128 జీబీ) - రూ.9,000 తగ్గింపు:

వన్ ప్లస్ 7 ప్రో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.48,999 కాగా, ఇప్పుడు కేవలం దీన్ని రూ.39,999కే విక్రయిస్తున్నారు. వన్ ప్లస్ 7 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లో ఉండే ఫీచర్లే ఇందులో కూడా ఉంటాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు ఉన్న ప్రధాన తేడా ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యం మాత్రమే.

*​వన్ ప్లస్ 7టీ(8 జీబీ ర్యామ్ + 128 జీబీ) - రూ.3,000 తగ్గింపు:

వన్ ప్లస్ తాజాగా సెప్టెంబర్ చివరిలో విడుదల చేసిన వన్ ప్లస్ 7టీ స్మార్ట్ ఫోన్ పై రూ.3,000 తగ్గింపు అందించారు. ఇంతకు ముందు దీని ధర రూ.37,999 కాగా, ప్రస్తుతం రూ.34,999కే లభిస్తోంది. ఇందులో 6.55 అంగుళాల అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లే, వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న టెలిఫొటో లెన్స్, 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ను కూడా అందించారు.

​*వన్ ప్లస్ 7టీ(8 జీబీ ర్యామ్ + 256 జీబీ) - రూ.2,000 తగ్గింపు:

వన్ ప్లస్ 7టీలో హై ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.39,999 కాగా, దీనిపై రూ.2,000 తగ్గింపును అందించి, రూ.37,999కే విక్రయించనున్నారు. పైన పేర్కొన్న వన్ ప్లస్ 7టీ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫీచర్లే ఇందులో కూడా ఉండనున్నాయి. ర్యామ్, స్టోరేజ్ మాత్రమే ఈ రెండు ఫోన్ల మధ్యనున్న తేడా.





Untitled Document
Advertisements