‘ఛ‌పాక్’ ట్రైల‌ర్ డేట్ ఎప్పుడంటే

     Written by : smtv Desk | Sun, Dec 08, 2019, 06:31 PM

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే న‌టిస్తున్న తాజా చిత్రం ఛ‌పాక్. ఈ మూవీలో దీపికా.. యాసిడ్ బాధితురాలి పాత్రలో కనిపిస్తున్నది. లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవిత చరిత్ర ఆధారంగా ఛపాక్ తెరకెక్కుతున్నది. రాజీ మూవీ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్‌ను ప్లే చేయడంతోపాటు సినిమా ప్రొడ్యూసర్ కూడా దీపికానే కావడం విశేషం. దీపికా లుక్‌కి సంబంధించిన ఇటీవ‌ల‌ కొన్ని ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఇందులో దీపికా అచ్చు గుద్దిన‌ట్టు.. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ లానే క‌నిపించింది. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న రిలీజ్ కానుంది. అటు ఈ మూవీ ట్రైల‌ర్‌ని డిసెంబ‌ర్ 10.. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం రోజు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.





Untitled Document
Advertisements