తల్లిపాలు తాగితే గుండెనొప్పులు దూరం!

     Written by : smtv Desk | Sun, Dec 08, 2019, 08:12 PM

తల్లిపాలు తాగితే గుండెనొప్పులు దూరం!

తల్లిపాలు పిల్లలకు ఆరోగ్యాన్నిస్తాయి. ఇవి అందరికి తెలుసు. కానీ, రొమ్ము పాలు తాగడం వల్ల పిల్లలకి గుండెనొప్పులు రావని చెబుతున్నారు నిపుణులు. తల్లి పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఓ రకంగా చెప్పాలంటే అమ్మపాలు అమృతంతో సమానం అని చెప్పొచ్చు. బిడ్డకు మొదటిసారిగా తల్లిపాలే పట్టించాలి. దీని వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకు ఎలాంటి జబ్బులు రావు. భవిష్యత్‌లోనూ బిడ్డ ఆరోగ్యం బావుంటుంది. తాజాగా పరిశోధకులు సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే.. తల్లి పాలు ఎక్కువగా తాగిన పిల్లలకు భవిష్యత్‌లో గుండె సమస్యలు రావట..

నెలలు నిండని పిల్లలకు రొమ్ముపాలతో ఆరోగ్యం..

కొంతమంది చిన్నారులు తల్లి గర్భంలో ఉండాల్సిన సమయం కంటే ముందే పుడుతుంటారు. నెలలు నిండక ముందే పుడతారు. ఇలాంటి బేబీస్‌ని ప్రీమెచ్యూర్ బెబీస్ అని అంటారు. ఇలాంటి పిల్లలకి తల్లిపాలు ఇచ్చి పెంచడం వల్ల వారికి భవిష్యత్‌లో వారికి గుండె సమస్యలు రావని చెబుతున్నారు నిపుణులు..

పరిశోధనల్లో తేలిన నిజాలు..

ఐర్లాండ్‌లో ఇదే అంశంపై పరిశోధకులు కొన్ని రోజులుగా పరిశోధనలు జరిపారు. తల్లి గర్భంలో పూర్తి సమయంలో లేకుండా త్వరగా పుట్టే పిల్లలకు గుండె గులు చిన్నవిగా ఉంటాయి. ఈ కారణంగా ఈ పిల్లలు పెరిగాక వారికి గుండె నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఇలాంటి పిల్లలకి ఎక్కువగా తల్లి రొమ్ము పాలు పట్టించడం వల్ల వారికి అవసరమైన హార్మోన్స్, గ్రోత్ ఫ్యాక్టర్ల వంటివి పెరుగుతాయి. ఈ కారణంగా వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు పరిశోధకులు.

అనేక పోషకాలు కలిగిన పాలు..

తల్లి పాలు తాగడం వల్ల కేవలం గుండె సమస్యలు తగ్గడమే కాదు.. అనేక సమస్యలు కూడా దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువగా తల్లి పాలు తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ కూడా బలంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ప్రతి పదమూడు మంది పిల్లల్లో ఒకరు ఇలా ముందే పుడుతుంటారు.. వీరిని తోటిపిల్లలతో పోల్చినప్పుడు వారి రక్తపోటు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ అంశాలన్నీ వారిని గుండెజబ్బులకు గురయ్యేలా చేస్తాయి. ఇలా నెలలు నిండని పిల్లలను పూర్తిగా రొమ్ముపాలపైనే పెంచితే.. గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

అమ్మపాలు అమృతంతో సమానం అని చెబుతున్నారు. ఈ పాలు తాగడం వల్ల పిల్లలకు ఎన్ని లాభాలో.. తల్లులకు కూడా అన్నీ లాభాలు ఉన్నాయి. తల్లిపాలు తాగడం వల్ల పిల్లల ఆరోగ్యం బావుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండే అనేక సమస్యలు దూరం అవుతాయి. అదే విధంగా తల్లి పాలు ఎక్కువగా తాగిన పిల్లలకు భవిష్యత్‌లో అధిక బరువు వంటి సమస్యలు కూడా రావని చెబుతున్నారు నిపుణులు. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకి రకరకరాల ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. డయేరియా, వాంతుల సమస్య ఉండదు.

ఇద్దరికీ మంచిదే..

అయితే, తల్లి పాలు తాగడం వల్ల పిల్లలకే కాదు.. పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా అనేక లాభాలు ఉన్నాయి. పిల్లలకి పాలు పట్టడం వల్ల తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి.

సాధారణంగా బిడ్డకి రెండో సంవత్సరం వరకూ పిల్లలకి పాలు పట్టించొచ్చు. ఆ తర్వాత ఏవైనా ఘన పదార్థాలు తినిపించొచ్చు. అయితే ఆ ఆహారం కూడా పోషకాలు నిండుగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. ఇలా పిల్లలకి ఆ సమయం వరకూ పాలు పట్టడం వల్ల తల్లి, బిడ్డకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.





Untitled Document
Advertisements