జియో వినియోగదారులు ఎయిర్టెల్ కి షిఫ్ట్ ? కానీ

     Written by : smtv Desk | Mon, Dec 09, 2019, 07:35 AM

ఇండియాలో మరోసారి మొబైల్ కాల్ రేట్ల పోటీకి తెరలేచింది. రిలయన్స్ జియో సహా ప్రధాన టెలికాం ఆపరేటర్లు కాల్ చార్జీలు పెంచేశారు. అందుకు అనుగుణంగా కొత్త ప్లాను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో జియో వర్గాలు స్పందించాయి. ప్రత్యర్థి సంస్థలతో పోల్చితే తమ ప్లాన్లు ఎంతో చవక అని, తమ ప్లాన్లతో సాధారణ వినియోగదారుడు ఐదు రెట్లు ఎక్కువగా సదుపాయాలు అందుకుంటాడని, ఇందుకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని జియో పేర్కొంది. ట్రాయ్ ఐయూసీ చార్జి కారణంగా మొబైల్ ఆపరేటర్లు కాల్ చార్జీలు పెంచిన సంగతి తెలిసిందే.

అయితే ప్రత్యర్థులతో పోటీని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ టెల్, వొడాఫోన్ అవుట్ గోయింగ్ కాల్స్ పై పరిమితిని ఎత్తివేశాయి. అయితే జియో మాత్రం తమ ఆల్ ఇన్ వన్ ప్లాన్లలో 28 రోజుల ప్లాన్ కు 1000 నిమిషాలు, 84 రోజుల ప్లాన్ కు 3000 నిమిషాలు మాత్రమే ఇతర నెట్ వర్క్ లకు అవుట్ గోయింగ్ సదుపాయం కల్పిస్తోంది. జియో నుంచి జియోకు మాత్రం అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏంటంటే ఈ రేట్లతో జియో కస్టమర్స్ ఎయిర్టెల్ , వోడాఫోన్ కి షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది .. కట్ చేస్తే జిఓ అంత ఫాస్ట్ గా ఇంటర్నెట్ సదుపాయం అందించడం లో ఎయిర్టెల్ విఫలం అయిందని చెప్పొచ్చు .. కావున వినియోగదారులు జియో కె ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది ..





Untitled Document
Advertisements