స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు

     Written by : smtv Desk | Mon, Dec 09, 2019, 01:08 PM

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ డిగ్రీ లేదా డిగ్రీతోపాటు తగిన అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాలు: అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, లా, జనరల్ మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ మొదలగునవి.

కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు. అభ్యర్థుల పనితీరు ఆధారంగా మరో 2 సంవత్సరాల పాటు పొడిగించే అవకాశం ఉంది.

అర్హత, వయసు..:

యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (లేదా) డిగ్రీతో పాటు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 20.12.2019 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు, ఎంపిక విధానం..:

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: అభ్యర్థుల మెరిట్ ఆధారంగా 1 : 5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక ఖరారు చేస్తారు.

జీతం: రూ.40,000 (ఫిక్స్‌డ్). ఎలాంటి అదనపు భత్యాలు ఉండవు. సంవత్సరానికి 30 సెలవులు ఉంటాయి.

నోటిఫికేషన్, అప్లికేషన్, చివరితేది..​

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.12.2019 (05:00 PM)





Untitled Document
Advertisements