అంతరిక్షంలో హోటల్...మనుషుల కోసం కాదు!

     Written by : smtv Desk | Mon, Dec 09, 2019, 01:59 PM

అంతరిక్షంలో హోటల్...మనుషుల కోసం కాదు!

అంతరిక్షంలో సేవలందిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ISS) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో రోబోటిక్ టూల్ స్టావేజ్ (RiTS) ద్వారా ‘రోబోట్ హోటల్’ను అందుబాటులోకి తేవాలని NASA నిర్ణయించింది. తొలి విడతలో రెండు రోబెటిక్ ఎక్స్‌ట్రనల్ లీక్ లొకేటర్స్ (RELL)లను ఏర్పాటు చేస్తారు. ఇవి అంతరిక్ష కేంద్రంలో లీకేజీలను అరికట్టేందుకు పనిచేస్తాయి. ఈ హైటెక్ రోబోట్లకు ఆమోనియాను పీల్చగలిగే మాస్ స్పెక్ట్రోమీటర్స్‌ ఉంటాయి.RELLను తొలిసారిగా 2015లో అంతరిక్షంలోకి పంపారు. దీనికి బ్యాకప్ కింద రెండో RELLను ఈ ఏడాది ఆరంభంలో పంపారు. తాజాగా మరో రెండు అత్యాధునిక RELLలు అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యాయి. రోబోట్ హోటల్‌లు ఉండే ఈ రెండు RELL ద్వారా రోబోట్లకు అవసరమైన వెచ్చదనం లభిస్తుంది. అలాగే, రేడియేషన్, మైక్రోమీటవురాయిడ్స్ లేదా సూక్ష్మ లేదా వేగంగా దూసుకొచ్చే వస్తువుల నుంచి కూడా భౌతిక రక్షణ కల్పిస్తాయి. రోబోట్‌లకు అవసరమైన ఉష్ణోగ్రతను అందిస్తుంటాయి. ఎందుకంటే, రోబోట్‌లు ఆహారం తీసుకోవు. అంతరిక్షంలో సరైన ఉష్ణోగ్రతలు ఉంటేనే అవి పనిచేయగలవు. అదే వాటికి తగిన ఆహారం. అందుకే.. NASA దీన్ని ‘రోబోట్ హోటల్’ అని పిలుస్తోంది.






Untitled Document
Advertisements