సైనికులపై ధోని టీవీషో?!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 05:40 AM

సైనికులపై ధోని టీవీషో?!

ప్రపంచ కప్ తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ పట్టలేదు. సైన్యంలో రెండు నెలలు పని చేయాలంటూనే ఆ పని పూర్తయిన తర్వాతకూ డా విరామాన్ని కొనసాగిస్తున్నాడు. ఈలోగా అతని రిటైర్మెంట్ గురించి మీడియాలో రకరకా లు కథనాలు రాగా రవిశాస్త్రి, గంగూలి లాంటి క్రికెట్ పెద్దలు ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు.‘ అతడి భవిష్యత్తుపై స్పష్టత ఉంది. సారథి విరాట్ కోహ్లీతో మాట్లాడాను. అన్ని విషయాలు బహిరంగంగా చెప్పడం కుదరదు. సమయం వచ్చినప్పుడు వివరిస్తా’ అని ఇటీవలే బిసిసిఐ పగ్గాలు చేపట్టిన సౌరబ్ గంగూలి చెప్పడం తెలిసిందే. కాగా విరామ సమయాన్ని ధోనీ సద్వినియోగం చేసుకుంటున్నాడు. కూతురు జీవా, సతీమణి సాక్షితో కలి సి విహారయాత్రలకు వెళ్తున్నాడు. సైనికాధికారులతో సమయం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో వారి కష్ట సుఖాలు ఆయనకు తెలిశా యి. ఇండియన్ ఆర్మీలో లెఫ్టెనెంట్ కల్నల్‌గా గౌరవం పొందిన ధోనీ ఇప్పుడు సైనికులు, వారి కుటుంబ సభ్యుల కష్టసుఖాల గురించి బైటి లోకానికి తెలియజేయడం కోసం సొంతం గా ఓ టీవీ షో రూపొందించాలనుకున్నాడు. భారత సాయుధ దళాల పనితనాన్ని,అలాగే వారి కష్టసుఖాల గురించి అందరికీ తెలియ జేసేలా ఈ షోను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక క్రికెటర్ ఇలాంటి ప్రయత్నం చేయడం విశేషం. పరమ వీరచక్ర, అశోక చక్ర పురస్కారాలు అందుకున్న వీరుల స్ఫూర్తిదాయక జీవితాలపై ఈ ధారావాహిక ఉంటుందని అభిజ్ఞ వర్గాల సమాచారం. సెట్ ఇండియాకు చెందిన స్టూడియో నెక్స్, ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి ఈ షోను నిర్మిస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు నడుస్తున్నాయని, వచ్చే ఏడాది ఈ షో లాంచ్ అవుతుందని అంటున్నారు. ఇంకా పూర్తి కాని ఈ టీవీ షో సోనీ టీవీలో ప్రసారమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements