దూబేపై మా ప్రణాళిక ఫలించింది!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 05:46 AM

ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి 20 మ్యాచ్‌లో ఊహించని విధంగా వన్‌డౌన్‌లో కోహ్లీ కాకుండా శివమ్ దూబే వచ్చాడు. తొలుత నిదానంగా ఆడిన దూబే ఆ తర్వాత సిక్సర్లు, ఫోర్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ దూబేను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపించడానికి గల కారణాలను వివరించాడు.‘ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలుసు. బ్యాటింగ్ ఆర్డర్‌లో దూబే ముందు వెళ్లి వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకు పడాలని భావించాం. అందుకే అతడిని వన్‌డౌన్‌లో పంపించాం. మా ప్రణాళిక ఫలించింది. అతడు బాగా ఆడడం వల్లే మంచి స్కోరు సాధించాం. అయితే గత రెండు మ్యాచ్‌లలో మా పీల్డింగ్ నాసిరకంగా ఉంది. భువనేశ్వర్ వేసిన ఒక ఓవర్‌లో రెండు క్యాచ్‌లు జారవిడిచాం. మా ఫీల్డింగ్ తప్పనిసరిగా మెరుగుపడాలి. తొలి టి20లో కష్టతరమైన క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకోవడానికి ప్రయత్నించా. కానీ అది సాధ్యం కాలేదు. ఈ సారి రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నా’ అని కోహ్లీ చెప్పాడు. ఆదివారం జరిగిన రెండో టి20లో ఫీల్డింగ్‌లో లోపాలతో టీమిండియా భారీ మూల్యమే చెల్లించుకుంది. సహచరులంతా పేలవమైన ఫీల్డింగ్ చేస్తున్నా కోహ్లీ మాత్రం కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని మ్యాచ్‌ని తిరిగి గాడిలోకి తీసుకొచ్చారు. జడేజా బౌలింగ్‌లో వరసగా రెండు సిక్స్‌లు కొట్టిన వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ హెట్‌మెయిర్ హ్యాట్రిక్ సిక్స్ కోసం లాంగాన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. దూరం నుంచి మురుపు వేగంతో దూసుకొచ్చిన కోహ్లీ డైవ్ చేస్తూ అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టాడు. బంతిని అందుకున్న తర్వాత బౌండరీ లైన్‌ను తాకకుండా అతను నియంత్రించుకున్నతీరుకు ఎవరైనా ముగ్ధులు కావలసిందే.





Untitled Document
Advertisements