అన్నదమ్ముల కాంబినేషన్‌లో?

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 05:50 AM

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమాను లైన్‌లో పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తోంది. ఇదిలాఉండగా విజయ్ దేవరకొండ నెక్స్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ యంగ్ స్టార్ తన నెక్స్ సినిమాలో తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి నటిస్తాడని అంటున్నారు. అయితే ఇది పూరి సినిమా ‘ఫైటర్’ లోనా లేదా మరో సినిమాలోనా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది. ఆనంద్ నటిస్తున్న రెండవ సినిమా షూటింగ్ పెద్దగా హడావుడి లేకుండా సాగుతోంది. అయితే విజయ్ తన తమ్ముడి కెరీర్‌కు ఊపును తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాడట. అందుకే ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ సినిమాలో ఇద్దరు ఫుల్‌లెంగ్త్ హీరోలుగా నటిస్తారా లేదా విజయ్ కేవలం అతిథి పాత్రలో నటిస్తాడా అనేది మాత్రం ఇంకా తెలియదు. అసలు ఇద్దరు కలిసి నటిస్తారా? అనేది కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements