34 ఏళ్లకే ప్రధాని పదవి...రికార్డు బ్రేక్

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 05:57 AM

ఎన్నికై ఫిన్ లాండ్ కు చెందిన సన్నా మారిన్(34) ప్రపంచంలోనే అతిపిన్న వయస్సులోనే ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మాజీ ప్రధాని అంటి రిన్నే.. దేశంలో పోస్టల్ సమ్మెను సరిగా నియంత్రించలేకపోవడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఆమెను ప్రధానిగా ఎన్నుకుంటూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్డిపి) నిర్ణయం తీసుకుంది. ఫిన్లాండ్ ప్రధాని కోసం జరిగిన ఓటింగ్ లో మారిన్ మాజీ ప్రధాని అంటీ రీనేపై అతి తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించింది. మారిన్ త్వరలో ప్రధాని బాధ్యతలను స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్ డెర్న్(36) ఏళ్లు కాగా, ఉక్రెయిన్ ప్ర‌ధాని ఒలేక్క్‌సీ హోంచార్కు (35) ఏళ్లు. 1991లో ఫిన్ లాండ్ ప్రధానిగా ఎన్నికైన ఎస్కో హో(36) రికార్డను సన్నా మారిన్ బ్రేక్ చేసింది.





Untitled Document
Advertisements