టాప్10 జాబితాలో మొదటి స్థానం, ఆస్తుల విలువ రూ.32 వేల కోట్లు

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 06:16 AM

మాక్రోటెక్ డెవలపర్స్‌కు చెందిన మంగళ్ ప్రభాత్ లోధ అండ్ ఫ్యామిలీ దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 10 జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వారి నికర ఆస్తుల విలువ రూ.31,960 కోట్లు. రూ.25,080 కోట్ల నికర ఆస్తుల విలువతో డిఎల్‌ఎఫ్ అధినేత రాజీవ్ సింగ్ రెండో స్థానంలో ఉన్నారు. సోమవారం గ్రోహె హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ టాప్ -10 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో లోధా డెవలపర్స్ పేరిట సంస్థను నడుపుతున్న ఎంపి లోధా అండ్ ఫ్యామిలీ ఆస్తులు 31,960 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. మాక్రోటెక్ డెవలపర్స్ వరుసగా రెండో సంవత్సరం ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. లోధా సంపద ఈ ఏడాది 18 శాతం పెరిగింది. దేశంలోని 100 మంది ధనవంతులైన డెవలపర్‌లలో లోధా కుటుంబం మొదటి స్థానంలో ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది వ్యాపారులు తిరోగమనంలో ఉన్నారు. అయితే హురున్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ జాబితాలో డిఎల్‌ఎఫ్‌కు చెందిన రాజీవ్ సింగ్ రెండో స్థానంలో, ఎంబసి గ్రూపునకు చెందిన జితేంద్ర విర్వానీ మూడో స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న డిఎల్‌ఎఫ్‌కు చెందిన రాజీవ్ సింగ్ మొత్తం ఆస్తులు రూ.25,080 కోట్లు. ఇది 2018 తో పోలిస్తే 42 శాతం పెరిగింది. 2019 సెప్టెంబర్ 30 వరకు ఉన్న ఆస్తిని ఈ జాబితాలో చేర్చారు. మూడో స్థానంలో ఎంబసి ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌కు చెందిన జీతేంద్ర విర్వానీ నిలిచారు. ఆయన మొత్తం ఆస్తులు రూ.24,750 కోట్లు. నాలుగో స్థానంలో హిరానందాని కమ్యూనిటీస్ గ్రూపుకు చెందిన నీరంజన్ హిరానందాని ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తులు రూ.17,030 కోట్లు. దీని తర్వాత ఐదో స్థానంలో కె.రహెజా గ్రూపుకు చెందిన చంద్రో రహెజా ఉండగా, ఆస్తులు రూ .15480 కోట్లుగా ఉన్నాయి. ఆరో స్థానంలో ఒబెరాయ్ రియాల్టీకి చెందిన వికాస్ ఒబెరాయ్, ఆయన ఆస్తుల విలువ 13,910 కోట్ల రూపాయలు. ఏడో స్థానంలో 9960 కోట్ల రూపాయల ఆస్తులతో బాగమనే డెవలపర్స్ ఉంది. ఎనిమిదో స్థానంలో ఉన్న హిరానందాని ఆస్తుల విలువ 9720 కోట్లు. రన్వాల్ డెవలపర్స్‌కు చెందిన సుభాష్ రన్వాల్ 7100 కోట్ల రూపాయల ఆస్తులతో తొమ్మిదవ స్థానంలో నిలిచారు. 10వ స్థానంలో పిరమల్ రియాల్టీకి చెందిన అజయ్ పిరమల్, ఆయన ఆస్తుల విలువ 6560 కోట్లు. నివేదిక ప్రకారం, ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోని 100 మంది పెద్ద వ్యాపారవేత్తల మొత్తం నికర విలువ రూ .2.77 లక్షల కోట్లు. ఈ సంవత్సరం ముంబై, ఢిల్లీ, బెంగళూరు అనే మూడు నగరాల డెవలపర్‌లకు రియల్ ఎస్టేట్ రిచ్ జాబితాలో 75% వాటా ఉంది. ఈ ఏడాది 6 రియల్ ఎస్టేట్ కంపెనీలు రూ .2,000 కోట్లకు పైగా, 20 కంపెనీలు రూ .1000 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. మార్చి 31 నాటికి లోధా ఫ్యామిలీ మాక్రోటెక్ డెవలపర్లకు 40 ప్రాజెక్టులు ఉన్నాయి.





Untitled Document
Advertisements