మరో 100 వాహన విక్రయ కేంద్రాలు!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 07:11 AM

టాటా మోటార్స్ నుంచి మరో 100 వాహన విక్రయ కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తోంది. దీని ద్వారా దేశంలోని పలు ప్రాంతాలలో సంస్థ పరిధిని మరింత బలోపేతం చేయాలనుకుంటోంది. టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ మాట్లాడుతూ, – కంపెనీ అమ్మకాల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని, కొత్త ప్రాంతాల్ల్లోకి అడుగుపెట్టడం ద్వారా డీలర్ అమ్మకాలు పెంచుకుంటామని అన్నారు. డీలర్లు సంస్థ ఉత్పత్తి శ్రేణిని చూసి ఉత్సాహంగా ఉన్నారని, కొత్త అవుట్‌లెట్‌లు (కేంద్రాలు) తెరవడం ద్వారా విస్తరించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కంపెనీకి దేశవ్యాప్తంగా 860 షోరూమ్‌లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 100 విక్రయ కేంద్రాలను కంపెనీ తన నెట్‌వర్క్‌కు చేర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 200 కొత్త కేంద్రాలను చేర్చే యోచనలో ఉందని పరీక్ తెలిపారు. నవంబర్‌లో టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాం డ్ రోవర్(జెఎల్‌ఆర్) రిటైల్ అమ్మకాలు 46,542 యూనిట్లతో 3.4% క్షీణించాయి. జాగ్వార్ అమ్మకాలు 11,464 యూనిట్లతో 23% తగ్గాయి. ఈమేరకు బిఎస్‌ఇ ఫైలింగ్ కంపెనీ వెల్లడించింది. ల్యాండ్ రోవవ్ సేల్స్ 35,078 యూనిట్లతో 5.5 శాతం పెరిగాయి. అంతర్జాతీయ ఆటోమోటివ్ మార్కెట్‌లో ఆశించిన మేరకు లేవని జెఎల్‌ఆర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఫెలిక్స్ బ్రాటిగమ్ అన్నారు.





Untitled Document
Advertisements