నాలుగు కెమెరాలతో వివో ఫోన్...ధరెంతో తెలుసా?

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 07:13 AM

వివో తాజాగా అదిరిపోయే ఫీచర్లతో వివో వీ17ను మార్కెట్లో లాంచ్ చేసింది. మరి అంతలా ఈ ఫోన్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? దీని ధర ఎంత? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.22,990గా నిర్ణయించారు. మిడ్ నైట్ ఓషన్(బ్లాక్), గ్లేసియర్ ఐస్(వైట్) రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. మన దేశంలో దీనికి సంబంధించిన సేల్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రీబుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దేశంలో ఉన్న అన్ని ప్రముఖ ఆన్ లైన్, ఆఫ్ లైన్ రిటైల్ సంస్థల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ను అందించారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యమున్న బ్యాటరీ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యూఎస్ బీ టైప్-సీని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 9.2పై వివో వై17 పని చేస్తుంది. డ్యూయల్ సిమ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. 4జీ వోల్టే, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు.






Untitled Document
Advertisements