వర్మపై కేసు నమోదు

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 03:10 PM

సంచలన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఏపీలో ఎన్నికలైపోయాక జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను ఆర్జీవీ తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది. అయితే ఈ సినిమా వివాదస్పదంగా మారడంతో నవంబర్ 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ముందుగా భావించినా సెన్సార్ సమస్యల కారణంగా సినిమా రిలీజ్‌కు బ్రేక్ పడింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్న సినిమా టైటిల్‌ను మార్చాలని చెప్పడంతో టైటిల్‌ను వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చారు.

అయితే ఈ సినిమాపై కేఏ పాల్ కూడా మండిపడుతూ ఈ సినిమాను రిలీజ్ చేయవద్దని కోర్ట్‌లో పిటీషన్ కూడా దాఖలు చేశాడు. కానీ తాజాగా ఈ సినిమాకు సెన్సార్ ఆమోదం తెలపడంతో ఈ సినిమా డిసెంబర్ 12వ తేదిన రిలీజ్ కాబోతుంది. అయితే కేఏ పాల్ నుండి వర్మ సెన్సార్ సర్టిఫికేట్ అందుకున్నట్టు మార్ఫింగ్ చేసిన ఫోటోను వర్మ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వర్మ ఆ ఫోటోను డిలీట్ చేశాడు. అయితే దీనిపైన పాల్ సహాయకురాలు జ్యోతి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు వర్మపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు వర్మపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.





Untitled Document
Advertisements