శృంగార పాఠాలు చెబుతున్న టీచరమ్మ!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 04:10 PM

శృంగార పాఠాలు చెబుతున్న టీచరమ్మ!

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు 14 ఏళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులకు శృంగార పాఠాలు చెబుతూ నీచ కార్యకలాపాలకు పాలది అడ్డంగా దొరికింది. అమెరికాలోని నార్త్ కరోలినా, ఆన్‌స్లో కౌంటీలోని హంటర్స్ క్రీక్ మిడిల్ స్కూల్‌లో ఆష్లే హన్సన్ బీస్లే సైన్స్ టీచర్‌గా పని చేస్తోంది. ముగ్గురు బిడ్డల తల్లి అయిన ఆష్లే.. 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను లైంగికంగా లోబరుచుకుంది. వీరిద్దరికీ తరచూ తన అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపేది. అలాగే తరగతి గదిలో సైతం వీరితో రహస్యంగా సరససల్లాపాలు సాగించేది. అయితే ఈ తతంగాన్ని గుర్తుతెలియని ఒకరు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపిన యాజమాన్యం ఆష్లే తప్పు చేసినట్లుగా నిర్ధారించుకుని.. స్థానిక కౌంటీ విచారణ అధికారికి ఫిర్యాదు చేశారు. కౌంటీ అధికారులు ఆష్లేను అదుపులోకి తీసుకుని విచారించగా, ఇద్దరు బాలురకు అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపినట్లుగా ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్టు చేసి.. సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. అంతకు ముందే ఆష్లే టీచర్ పోస్టుకు రాజీనామా చేసి, టీచింగ్ లైసెన్స్‌ను కౌంటీ కార్యాలయంలో అప్పగించింది. ఆష్లే ఈ ఏడాది ఆగస్టులోనే క్రీక్ మిడిల్ స్కూల్‌లో టీచర్‌గా చేరింది. ఇంతలోనే ఇంతటి ఘనకార్యానికి పాల్పడటం గమనార్హం.






Untitled Document
Advertisements