మరణశిక్ష వద్దు...సుప్రీంను కోరిన నిర్భయ హంతకుడు

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 05:40 PM

మరణశిక్ష వద్దు...సుప్రీంను కోరిన నిర్భయ హంతకుడు

నిర్భయ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్..మరణ శిక్ష తీర్పును సమీక్షించాలంటూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 2012 నాటి నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో ఉరి శిక్ష విధిస్తూ.. 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరారు. ఈ కేసులో మిగతా ముగ్గురు దోషులు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. 2018 జూలై 9న అత్యున్నత న్యాయస్థానం వాటిని తిరస్కరించింది.గతంలో రివ్యూ పిటిషన్ వేయని 31 ఏళ్ల అక్షయ్ తరఫున ఆయన లాయర్ ఏపీ సింగ్ మంగళవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, జల కాలుష్యం కారణంగా ఎలాగో నా ఆయుష్షు తగ్గిపోతోంది. కాబట్టి తనకు మరణశిక్ష విధించొద్దని అక్షయ్ సుప్రీం కోర్టును కోరడం గమనార్హం. ఢిల్లీ వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వాలను మందలిస్తూ.. సుప్రీం కోర్టు గతంలో చేసిన ఘాటైన వ్యాఖ్యల నేపథ్యంలో.. నిర్భయ దోషి.. వాయు కాలుష్యం ప్రస్తావన తీసుకురావడం గమనార్హం.2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో 23 ఏళ్ల ఓ విద్యార్థినిని దక్షిణ ఢిల్లీలో ఆరుగురు వ్యక్తులు కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె మర్మావయవాల్లోకి పదునైన వస్తువులను జొప్పించారు. తీవ్రగాయాలపాలైన ఆమె.. అదే ఏడాది డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఎలిజబెత్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.ఈ కేసులో ఆరుగురు దోషులుగా తేలారు. నిందితుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో దోషిగా తేలిన మైనర్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ముకేశ్ (30), పవన్ గుప్తా (23), వినయ్ శర్మ (34), అక్షయ్‌లకు ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించాలని తీర్పునివ్వగా.. ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది. తమను ఉరితీయొద్దంటూ ముగ్గురు దోషులు గతంలో సుప్రీంను కోరగా.. అత్యున్నత న్యాయస్థానం వారి అభ్యర్థనను తిరస్కరించింది.







Untitled Document
Advertisements