తక్కువ ధరతో వస్తున్న రెడ్ మీ కే30

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 06:36 PM

తక్కువ ధరతో వస్తున్న రెడ్ మీ కే30

షియోమీ మరోసారి అదిరిపోయే ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన పాత ఫోన్లకే డిజైన్, ఫీచర్లలో చిన్న చిన్న మార్పులు చేసి తర్వాతి వెర్షన్ గా విడుదల చేస్తుందని సాధారణంగా అనుకుంటూ ఉంటారు. ఈ విమర్శ కూడా షియోమీకి గట్టిగా వినిపించే ఉంటుంది. అందుకేనేమో రెడ్ మీ కే30 ఫోన్ లో డిజైన్, ఫీచర్ల విషయంలో చాలా మార్పులు చేసింది. రెడ్ మీ కే20కి తర్వాతి వెర్షన్ లాగా కాకుండా రెడ్ మీ కే30నే ఒక ప్రత్యేకమైన ఫోన్ తరహాలో కనిపిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను అంత బాగా తీర్చిదిద్దారు. అంతే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ రెండు వెర్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్లు ముందుగా చైనాలో లాంచ్ అయ్యాయి. మిగతా దేశాల్లో ఎప్పుడు వస్తుందనే అంశంపై షియోమీ ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు.రెడ్ మీ కే30 4జీ స్మార్ట్ ఫోన్ లో మొత్తం నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,599 యువాన్లుగా(రూ.16,100) నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 యువాన్లుగా(రూ.17,100) ఉండగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 1,899 యువాన్లుగా(రూ.19,100) ఉండనుంది. ఇక అన్నిటి కంటే హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,199 యువాన్లుగా(రూ.22,100) నిర్ణయించారు.డీప్ సీ లైట్, పర్పుల్ జేడ్ ఫ్యాంటసీ, ఫ్లవర్ షాడో రంగులు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రీ సేల్ చైనాలో నేటి(డిసెంబర్ 10) నుంచి ప్రారంభం కానుంది.రెడ్ మీ కే30 5జీ స్మార్ట్ ఫోన్ లో కూడా నాలుగు వేరియంట్లను అందుబాటులో ఉంచారు. ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా(రూ.20,100) ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగా(రూ.23,100) ఉండగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,599 యువాన్లుగా(రూ.26,100) నిర్ణయించారు. ఇక అన్నిటి కంటే హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,899 యువాన్లుగా(రూ.29,100) నిర్ణయించారు.ఈ స్మార్ట్ ఫోన్ లో డీప్ సీ లైట్, టైమ్ మోనోలాగ్, పర్పుల్ జేడ్ ఫ్యాంటసీ, ఫ్లవర్ షాడో రంగులు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రీ సేల్ కూడా చైనాలో నేటి(డిసెంబర్ 10) నుంచే ప్రారంభం కానుంది.రెడ్ మీ కే30లో అద్భుతంగా అనిపించే విషయం ఏంటి అంటే కెమెరాలు, వాటి సెటప్ అని చెప్పవచ్చు. ముందు భాగంలో పంచ్ హోల్ లో అందించిన రెండు కెమెరాలు ఫొటోలు తీయడానికి మాత్రమే కాకుండా.. డిజైన్ పరంగా కూడా అదరహో అనిపించేలా ఉంటాయి. అలాగే వెనకవైపు కూడా నాలుగు కెమెరాలను నిలువుగా అందించారు. కెమెరాల సెటప్ మాత్రమే కాకుండా వాటి పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది. వెనకవైపున 64 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్686ను అందించగా.. ముందు భాగంలో 20 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కొత్తగా అందించారు. సాధారణంగా ఈ మధ్యకాలంలో విడుదలయ్యే ఫోన్లన్నిటికీ అయితే వెనకవైపు, లేకపోతే ముందు వైపు అందించడం సాధారణం అయి ఉంటుంది. కానీ ఈ ఫోన్ లో కొంచెం కొత్తగా ఫోన్ కు పక్కభాగంలో ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. అయితే ఈ ఫోన్ లో అందించిన రెండు వేరియంట్లలో వివిధ ప్రాసెసర్లు ఉపయోగించారు. అలాగే ఫీచర్లలో కొన్ని ఇతర తేడాలు ఉన్నాయి.ఈ రెండు వేరియంట్లలోనూ 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ పంచ్ హోల్ డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 91 శాతం. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 5జీ వెర్షన్ లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765G ప్రాసెసర్ ను అందించగా, 4జీ వెర్షన్ లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ అందుబాటులో ఉంది. మెమొరీ కార్డు స్లాట్ ద్వారా 256 జీబీ వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మాక్రో లెన్స్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న డెప్త్ సెన్సార్ ను అందించారు. సెల్ఫీ ప్రియుల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను ముందువైపు అందించారు. ఇందులో అందించిన డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా సెటప్ ఫోన్ కు అందం తీసుకువచ్చిందని చెప్పవచ్చు. 4జీ వేరియంట్ లో 5 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ బదులు 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ ను అందించారు. అది తప్ప కెమెరా ఫీచర్లు రెండు ఫోన్లలోనూ ఒకటేనని చెప్పవచ్చు.ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్క భాగంలో అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్ గా ఉంది. ఈ ఫోన్ యూఎస్ బీ టైప్-సీని సపోర్ట్ చేస్తుంది. 5జీ వేరియంట్ 30W ఫాస్ట్ చార్జింగ్ ను, 4జీ వేరియంట్ 27W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తాయి. అలాగే 5జీ నెట్ వర్క్ కోసం డ్యూయల్ బ్యాండ్ 4జీ/5జీ సపోర్ట్(ఎస్ఏ/ఎన్ఎస్ఏ), 5జీ మల్టీ లింక్, 5జీ స్మార్ట్ ఫీచర్లను 5జీ వేరియంట్ లో అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఎన్ఎఫ్ సీ, 5జీ జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లు రెండు వేరియంట్లలోనూ ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలోనూ హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ ఉందన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం.























Untitled Document
Advertisements