అమెరికాలోని అయోవాలో తీవ్రంగా మంచు కురిసింది. దీంతో హైవే మొత్తం మంచుతో నిండిపోయింది. మంచు తీవ్రత వల్ల ఒకేసారి 50 వాహనాలు రోడ్డు స్పష్టంగా కనిపించక ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఇలా సుమారు 50 పైగా వాహనాలు దారిపొడవునా ఢీకొట్టుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఓ వాహనదారుడు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. దీంతో అది వైరల్గా మారింది. వాహనాలు ఢీకొంటున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడండి.