మూడేళ్లుగా టాయిలెట్‌లోనే బ్రతుకుతున్న అవ్వ

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 10:08 PM

మూడేళ్లుగా టాయిలెట్‌లోనే బ్రతుకుతున్న అవ్వ

రాజకీయ పార్టీలు, నాయకుల స్వార్థం వల్ల దేశం ఇంకా వందేళ్ల వెనక్కే ఉందనే సంగతి ఇలాంటి ఘటనలను చూస్తేనే అర్థమవుతుంది. దేశంలో కనీసం కూడు, గూడుకు నోచుకోని ప్రజలకు కొదవేలేదు. ఈ అవ్వ కూడా ఆ కోవకు చెందినదే.ఒడిశాలోని మయూర్భాంజ్ గ్రామానికి చెందిన 72 ఏళ్ల ద్రౌపతి బెహరా అనే గిరిజన మహిళ.. మూడేళ్లుగా టాయిలెట్‌లోనే నివసిస్తోంది. సొంతవారు ఎవరూ లేకపోవడంతో అందులోనే ఒంటరిగా జీవిస్తోంది. అందులోనే వంట చేసుకుంటూ.. అందులోనే నిద్రపోతూ దయనీయ జీవితం గడుపుతోంది.ఆమె దీనావస్థను చూసి కనీసం ఆదుకొనేవారు కూడా లేరు. గ్రామస్తులు, బంధువులు ఆమెను అనాథగా వదిలేశారు. ఆమె గురించి ఆ గ్రామ సర్పంచి బుధురాం పుటిని ప్రశ్నించగా.. ఆమెకు ఇల్లు నిర్మించేందుకు తనకు అధికారం లేదని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆమెకు ఇల్లు మంజురైతే మాత్రమే సాయం చేయగలమని చెప్పారు. పాపం.. ఆ అవ్వ ఇంకా ఎన్నాళ్లు దుర్భర పరిస్థితుల్లో జీవించాలో!






Untitled Document
Advertisements