మొండి బకాయిల్లో రూ.11932 కోట్ల తేడా

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 05:32 AM

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బిఐ ఎన్‌పిఎ (మొండి బకాయిలు), ప్రొవిజనింగ్ (కేటాయింపులు) గణాంకాలలో ఆర్‌బిఐ తేడాను గుర్తించింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (2018-19) రూ.1,72,750 కోట్ల స్థూల ఎన్‌పిఎను ఎస్‌బిఐ ప్రకటించినప్పటికీ ఆర్‌బిఐ దీనిని రూ.1,84,682 కోట్లుగా అంచనా వేసింది. అంటే రూ.11,932 కోట్ల తేడా ఉంది. ఈమేరకు ఎస్‌బిఐ మంగళవారం స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. నికర ఎన్‌పిఎల నివేదికలో రూ.65,895 కోట్లుగా ఎస్‌బిఐ ప్రకటించింది. అయితే ఆర్‌బిఐ ప్రకారం ఇది రూ .77,827 కోట్లు మాత్రమే. దీంతో రూ.11,932 కోట్ల తేడా కనిపించింది. ఎన్‌పిఎ ప్రొవిజనింగ్ గణాంకాల ప్రకారం రూ.12,036 కోట్ల తేడా ఉంది. ఈ మొత్తాన్ని రూ.1,06,856 కోట్లుగా ఎస్‌బిఐ ప్రకటించగా, ఆర్‌బిఐ రూ.1,18,892 కోట్లుగా అంచనా వేసింది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన బ్యాంకులు ఆర్‌బిఐ తుది రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్ అందుకున్న 24 గంటలలోపు ఎన్‌పిఎ, ప్రొవిజనింగ్ గణాంకాలలో తేడాను ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది.





Untitled Document
Advertisements