ఇసుక తిన్నెల్లో ఫోటోతో యూత్‌ను మురిపిస్తోంది

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 05:48 AM

తెలుగులో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ఈషా తల్వార్. ఈ భామ. హిందీలోనూ కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. మోడలింగ్ రంగం నుండి రావడంతో గ్లామర్ ఒలకబోతలో ఎలాంటి మొహమాటాల్లేవు ఈషా తల్వార్‌కు. ఇక తెలుగులో ‘గుండె జారి గల్లంతయ్యిందే’ తర్వాత ‘రాజా చెయ్యి వేస్తే’ వంటి ఒకటీ అరా సినిమాల్లో నటించింది. కానీ ఎక్కడా పెద్దగా గ్లామరస్‌గా కనిపించలేదు. అయితే ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో సందడిచేస్తూ ఉంటుంది. అలా తాజాగా ఈ భామ ఓ హాట్ ఫోటోతో యూత్‌ను మురిపిస్తోంది. బీచ్ బ్యాక్ గ్రౌండ్‌లో వైట్ కలర్ కాస్ట్యూమ్ ధరించి ఇసుక తిన్నెల్లో కూర్చొని ఉన్న ఈ బ్యూటీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటోలో అందాలొలకబోస్తున్న ఈషా తల్వార్ యూత్‌ను మైమరపిస్తోంది.





Untitled Document
Advertisements