38 మందితో ఉన్న చిలీ విమానం అదృశ్యం

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 05:49 AM

చిలీ కార్గోవిమానం సాయంత్రం 6 గంటల సమయంలో అదృశ్యమైంది. పుంటా ఆరెనస్ పట్టణం నుంచి సోమవారం సాయంత్రం 4.55 గంటలకు బయలు దేరిన ఈ విమానంలో 21 మంది ప్రయాణికులు కాగా, 17 మంది సిబ్బంది ఉన్నారు. సి130 హెర్కులెస్ కార్గో అనే ఈ విమానం అంటార్కిటికా లోని ఎడ్యుర్డో ఫ్రెయి విమానస్థావరానికి చేరుకోవలసి ఉండగా సాయంత్రం 6.13 గంటల సమయంలో సంబంధాలు కోల్పోయింది.కొన్ని గంటల పాటు సాగడానికి వీలుగా విమానంలో కాలవసిన ఇంధనం ఉందని చిలీ వైమానిక సిబ్బంది తెలియచేసింది. ఏడు గంటల తరువాత కమ్యూనికేషన్లు కోల్పోయి విమానం కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. పైలట్ అత్యవసరంగా సముద్రంలో విమానం దించి ఉండవచ్చని కమాండర్ ఎడ్యుర్డో మోస్‌క్విరా మంగళవారం చెప్పారు. ఉరుగ్వే, అర్జెంటైనా, చిలి విమానాలు, నౌకలు గాలింపు చర్యలను చేపట్టాయి. మంగళవారం బుయెనోస్ ఎయిరెస్‌లో పర్యటనకు బయలుదేర వలసిన చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా తన పర్యటనను రద్దు చేసుకున్నారు.





Untitled Document
Advertisements