వాషింగ్టన్ లో భారతీయ సిక్కు టాక్సీ డ్రైవర్ పై దాడి

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 05:52 AM

వాషింగ్టన్ స్టేట్ బెల్లింఘమ్ సిటీలో భారతీయ సంతతి సిక్కు టాక్సీ డ్రైవర్ పై దాడి జరిగింది. గ్రిఫిన్ లెవి సేయర్స్ అనే 22 ఏళ్ల యువకుడు సిక్కు ఊబర్ డ్రైవర్ ను ఇష్టానుసారంగా దూషించడమే కాక, భౌతికంగా దాడి చేశాడు. సిక్కు డ్రైవర్ గొంతునులిమి వేయడమే కాకుండా జాత్యహంకారంతో నల్లవాడని దూషించాడని పోలీసులు చెప్పారు. బాధితుడు భారతీయుడు, తలపాగా చుట్టుకుని ఉండడమే దాడికి కారణమని పోలీస్ అధికారి క్లౌడియామర్ఫీ తెలిపారు. ఘర్షణ జరిగిన తరువాత డ్రైవర్ తప్పించుకున్నాడు. దాడి చేసిన సేయర్స్‌ను అతని అపార్టుమెంటులో పోలీసులు కనుగొని అరెస్టు చేశారు. బెల్లింఘమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 13000 డాలర్ల పూచీకత్తుపై సేయర్స్‌కు డిసెంబర్ 6న బెయిలు లభించింది. డిసెంబర్ 5న సేయర్స్ ఊబర్‌ను బుక్ చేయగా, ఫాస్ట్‌ఫుడ్, సిగరెట్ల కొనుగోలుకు సేయర్స్‌ను తీసుకెళ్లానని, ఆ తరువాత తనపై దాడి జరిగిందని డ్రైవర్ పోలీసులకు చెప్పాడు.





Untitled Document
Advertisements