ఒరాకిల్ బోర్డు డైరెక్టర్లలోకి ఇన్ఫోసిస్ మాజీ సిఇఒ

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:05 AM

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ బోర్డు డైరెక్టర్లలో ఇన్ఫోసిస్ మాజీ సిఇఒ విశాల్ సిక్కా(52) ఒకరిగా చేరారు. సిక్కా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) స్టార్టప్ వయనే సిస్టమ్స్‌ను ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్‌లో ప్రపంచంలోనే ప్రముఖ నిపుణులలో ఒకరైన సిక్కా అనుభవం సంస్థకు దోహదం చేస్తుందని ఒరాకిల్ చైర్మన్, సిటిఒ లారీ ఎల్లిసన్ అన్నారు. వ్యాపార విలువలు, మార్పులకు అనుగుణంగా ఆయన ఒరాకిల్‌కు సహాయం చేస్తారని అన్నారు. ఆధునిక క్లౌడ్ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా స్వీకరించడం ఏ వ్యాపారమైనా డిజిటల్ పరివర్తనను చేపట్టడానికి వీలు కల్పిస్తుందని ఒరాకిల్ సిఇఒ సఫ్రా కాట్జ్ అన్నారు. ఒరాకిల్ జెన్ 2 క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఇతర లక్షణాలు కస్టమర్లు తమ వ్యాపారాన్ని పెంచుకోవడంలో ఎలా సహాయపడుతున్నాయో విశాల్ సిక్కా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. సిక్కా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ వయనే సిస్టమ్స్‌ను ప్రారంభించారు. ఒరాకిల్ బోర్డులో చేరడం పట్ల సిక్కా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంస్థ డేటాబేస్ ప్రపంచంలోని పెద్ద, ముఖ్యమైన సంస్థలకు ఆధారం అయ్యింది. నాలుగు ప్రధాన క్లౌడ్ కంపెనీలలో ఒరాకిల్ మాత్రమే ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ సూట్లను, ఇంటిగ్రేటెడ్ క్లౌడ్‌లో సురక్షితమైన మౌలిక సదుపాయాల సాంకేతికతను అందిస్తోందన్నారు. వివాదాల కారణంగా 2017లో ఇన్ఫోసిస్ నుంచి సిక్కా రాజీనామా చేశారు.





Untitled Document
Advertisements