స్వల్పంగా ఎంసిఎల్‌ఆర్‌ను తగ్గించిన బ్యాంకులు!

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:06 AM

ప్రభుత్వరంగ బ్యాంక్ బిఒబి(బ్యాంక్ ఆఫ్ బరోడా), అలాగే ప్రైవేటురంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లు తాజాగా ఎంసిఎల్‌ఆర్ రేట్లను తగ్గించాయి. ఏడాది ఎంసిఎల్‌ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్స్) 5 బేసిస్ పాయింట్లు తగ్గింపుతో 8.25 శాతానికి తగ్గనుంది. ఈ వడ్డీ రేటు తగ్గింపు డిసెంబర్ 12 నుంచి అమల్లోకి రానుంది. ఒక రోజు, నెల రోజులకు 20 బేసిస్ పాయింట్లు అంటే 7.85 శాతం నుంచి 7.65 శాతానికి తగ్గనుంది. ఇక మూడు నెలలు, ఆరు నెలల కాలానికి వరుసగా 7.8 శాతానికి, 8.1 శాతానికి తగ్గనుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా 15 బేసిస్ పాయింట్లు మేరకు ఎంసిఎల్‌ఆర్‌ను తగ్గించింది. వెబ్‌సైట్‌లో తెలిపిన ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 7 నుంచి అమల్లోకి వచ్చాయి. కోత తర్వాత ఆరు నెలల ఎంసిఎల్‌ఆర్ 8 శాతానికి, అలాగే ఏడాది కాలపరిమితికి 8.15 శాతానికి తగ్గనుంది. సోమవారంనాడు ఎస్‌బిఐ కూడా వడ్డీ రేటును తగ్గించింది. 10 బేసిస్ పాయింట్లు (0.10%) తగ్గించిన ఎస్‌బిఐ, ఈ వడ్డీ రేటు డిసెంబర్ 10 నుంచి అమల్లోకి రానుందని పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో (201920)లో ఇది వరసగా ఎనిమిదో సారి తగ్గింపు, గత నెలలో 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఎస్‌బిఐ ఏడాది ఎంసిఎల్‌ఆర్ ఇప్పుడు 8 శాతం నుండి 7.90 శాతానికి తగ్గుతుంది.





Untitled Document
Advertisements