యూత్ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:16 AM

కార్తికేయ హీరోగా శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘90 ఎంఎల్’. నేహా సోలంకి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా సక్సెస్ మీట్‌లో దర్శకుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బి, సి సెంటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. యూత్ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఈ సినిమా ఎంతగానో అలరిస్తోంది”అని తెలియజేశారు. కార్తికేయ మాట్లాడుతూ “శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్ అయిందని సోమవారంతో పూర్తిగా అర్థమైపోయింది. మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడు లేని విధంగా నా సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఒక మంచి ప్రమోషన్స్‌లా అనిపిస్తోంది. ఈ సినిమాలో నా ఫైట్ సీన్స్, డ్యాన్స్ చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం హ్యాపీగా అనిపించింది”అని తెలిపారు. అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ “ సినిమాలో మంచి కామెడీ ఉంది. మంచి ఎంటర్‌టైన్ మూవీ ఇది. రెండు గంటల పాటు ఎంజాయ్ చేస్తూ నవ్వుకునే చిత్రమిది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహా సోలంకి పాల్గొన్నారు.





Untitled Document
Advertisements